TG: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. చివరి రోజున ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీ తరఫు అడ్వకేట్లు, పిటిషన్ దారుల తరఫు అడ్వకేట్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. గతంలో స్పీకర్ పంపిన నోటీసులకు వివరణ ఇవ్వలేదు. దీంతో స్పీకర్ ఆ ఇద్దరికి మళ్లీ నోటీసులు పంపించారు. స్పీకర్ రెండోసారి పంపిన నోటీసులపై దానం, కడియం ఏ విధంగా స్పందించనున్నారనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.