చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై శ్రీనివాసరావు
NEWS Nov 21,2025 09:14 am
బుచ్చయ్యపేట మండలం వడ్డాది NTS స్కూల్లో కొత్త క్రిమినల్ చట్టాలైన BNS, BNSS, BSA, మత్తు పదార్థాల దుర్వినియోగం, సైబర్ నేరాలు, మహిళలు, పిల్లలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సమావేశాన్ని స్థానిక ఎస్సై శ్రీనివాసరావు నిర్వహించారు. విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంచి, నేరాల నుంచి దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో NTS స్కూల్ కరస్పాండెంట్ రామరాజు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.