గున్నెంపూడిలో అక్రమ మద్యం పట్టివేత
కేసు నమోదు చేసిన ఎస్సై శ్రీనివాసరావు
NEWS Nov 21,2025 09:13 am
బుచ్చయ్యపేట మండలంలోని గున్నెంపూడి గ్రామంలో అక్రమ మద్యం విక్రయం జరుగుతున్నట్టు వచ్చిన సమాచారంపై స్థానిక ఎస్సై శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి దాడి చేశారు. దాడిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తి వద్ద నుండి 50 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మద్యం సీసాలను స్టేషన్‌కు తరలించి, వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. పోలీసులు అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.