రాష్ట్రంలో చలి గాలుల తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలుల తీవ్రత వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపు నమోదవుతున్నాయి. 10 జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.4 డిగ్రీలు, కొమురంభీం -ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ -యూలో 8 డిగ్రీల చొప్పున నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.