సీపీ సజ్జనార్ బిగ్ వార్నింగ్
NEWS Nov 20,2025 09:32 pm
విధి నిర్వహణలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు, విధులకు అడ్డంకులు చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని సీపీ సజ్జనార్ హెచ్చరించారు. 221, 132, 121(1) సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. అవసరమైతే హిస్టరీ షీట్లు కూడా తెరుస్తామని, ఈ చర్యల వల్ల వ్యక్తి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు.