ఇందూరు బిడ్డ పసిడి పంచ్..!
NEWS Nov 20,2025 08:52 pm
ఇందూరు బిడ్డ, భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ విశ్వవేదికపై తన పంచ్ పవర్ చూపించి, దేశానికి ఐదో బంగారు పతకం అందించింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో చెలరేగిపోయిన నిఖత్ 51 కిలోల విభాగంలో ప్రత్యర్ధి గ్జువాన్ యూ గువోను మట్టికరిపించి విజేతగా నిలిచింది. పారిస్ ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన తను.. ఇప్పుడు యావత్ దేశం, తెలంగాణ రాష్ట్రం గర్వపడే విజయం సాధించింది.