నిరాశ్రయులకు GHMC ఆశ్రయం
NEWS Nov 20,2025 03:07 pm
తెలంగాణలో చలి తీవ్రత పెరుగడంతో నిరాశ్రయులు బస్ స్టాప్‌లు, ఫుట్‌పాత్‌లు, ప్లైఓవర్స్ కింద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. GHMC నిరాశ్రయులకు సహాయంగా కీలక నిర్ణయం తీసుకుని, నగరంలో 10 షెల్టర్ హోమ్స్‌లో ఉచిత వసతి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అన్నం అందిస్తోంది. రోడ్లపై తిరుగుతున్నవారిని ప్రత్యేక బృందాలు అక్కడికి తీసుకువెళ్తున్నాయి. తాత్కాలికంగా సిటీకి వచ్చినవారికి, మానసిక సమస్యలతో తిరుగుతున్నవారికి కూడా ఇవి ఆశ్రయం అందిస్తున్నాయి.