గుడ్డు వెరి గుడ్ అనేవారు కానీ.. కోడిగుడ్డు ధరలు పెరుగుతున్న విధానం చూస్తుంటే వెరీ బ్యాడ్ అనుకుంటున్నారు. మాంసాహారం భుజించలేని సామాన్యులకు గుడ్లు అందుబాటులో ఉండేవి. కానీ గుడ్డు ధర ఉన్నట్టు ఉండి అమాంతంగా పెరిగిపోతోంది. జిల్లాలో కోడిగుడ్డు రిటైల్ ధర గత కొన్ని రోజుల కింద రూ.5 నుంచి రూ.6.50 వరకు ఉండగా ప్రస్థుతం మార్కెట్‌లో గుడ్డు ధర రూ.8కి చేరిపోయింది.