నిమిషాల వ్యవధిలోనే ముగిసిన విచారణ
NEWS Nov 20,2025 01:36 pm
HYD: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు సిబ్బంది 'ఏ1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని పిలవగానే ఆయన కోర్టు హాల్లోకి ప్రవేశించి, జడ్జికి నమస్కరించారు. జడ్జి సూచన మేరకు హాజరు పట్టికలో సంతకం చేశారు. జగన్ ను జడ్జి ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. ఆయన హాజరును మాత్రమే పరిగణనలోకి తీసుకుని, సంతకం చేయించుకుని పంపించి వేశారు. రాబోయే రోజుల్లో పిటిషన్లపై విచారణ జరగనుంది.