పదోసారి బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణం
NEWS Nov 20,2025 12:45 pm
పట్నా: జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ బిహార్ సీఎంగా పదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.