నైపుణ్యం కలిగిన వృత్తులకే భవిష్యత్తు
NEWS Nov 20,2025 11:20 am
నైపుణ్య వృత్తులకు మంచి భవిష్యత్తు ఉందని జర్నలిస్టు స్వామి ముద్దం అంచనా వేశారు. డెస్క్ ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తున్న ఈ కాలంలో ప్లంబర్లు, ఎలక్ట్రిషియన్లు, మెకానిక్‌లు వంటి చేతి వృత్తులను యాంత్రీకరణ చేయడం అసాధ్యమని, ఫోర్డ్‌లో 5 వేల మెకానిక్ ఉద్యోగాలు ఖాళీగా ఉండటం, సరైన నైపుణ్యాల కొరత స్పష్టంగా చూపుతోందన్నారు. 2030 నాటికి ప్రపంచ తయారీ రంగంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కాని పరిస్థితి ఏర్పడనుందని స్టడీలు హెచ్చరిస్తున్నాయని, వృత్తి శిక్షణను స్కూల్ నుంచే ఇవ్వాలని, మెరుగైన వేతనాలు, బీమాలు, కెరీర్ వృద్ధి అందిస్తే యువత ఈ రంగం వైపు ఆకర్షితులు అవుతారని అభిప్రాయపడ్డారు.