TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు వారంలో ఖరారయ్యే అవకాశం ఉంది. 50%కి మించకుండా రిజర్వేషన్ల డెడికేషన్ కమిషన్ జాబితా రెడీ చేసి ప్రభుత్వానికి పంపనుందని తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక జాబితాతో జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి కలెక్టర్లకు నివేదిక ఇవ్వనుందని సమాచారం. దీని ప్రకారం GPల రిజర్వేషన్లు డిసైడ్ అవుతాయి. వారంలో ఇది కొలిక్కి రానుండగా దీని ఆధారంగా EC షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్ ఉంది.