హోటళ్ల యజమానుల ఇళ్లపై రైడ్స్
NEWS Nov 19,2025 11:03 pm
హైదరాబాద్‌లోని ప్రముఖ బిర్యానీ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్ యజమానుల ఇళ్లలో జరిపిన ఐటీ సోదాల్లో భారీగా నగదు, బంగారం పట్టుబడ్డాయి. 2 రోజులుగా సోదాలు నిర్వహించిన అధికారులు రూ.20 కోట్ల నగదుతో పాటు పెద్ద మొత్తంలో గోల్డ్, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లపై ఆరా తీస్తున్నారు. ఐటీ చెల్లింపులో అవకతవకల నేపథ్యంలో రైడ్స్ జరిగినట్లు సమాచారం.