సితార కోసం మహేశ్, నమ్రతకు వార్నింగ్
NEWS Nov 19,2025 11:00 pm
తమ కుమార్తెలు సినిమాల్లోకి రాకుండా మేల్ యాక్టర్స్ నిరుత్సాహ పరుస్తున్నారని నటి మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘యాక్టర్స్ డాటర్స్’ సినిమా రంగంలో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. మహేశ్, నమ్రతల స్టార్ కిడ్ సితారకు మంచి విజిబులిటీ ఉందన్నారు. ‘నమ్రత ప్రగతిశీల మహిళ. స్త్రీలను ఎలా పైకి తేవాలో ఆమెకు తెలుసు’ అని పేర్కొన్నారు. సితారను బయటకు తీసుకురాకుంటే వారిద్దర్నీ కొడతానని సరదాగా వ్యాఖ్యానించారు.