తీవ్ర చలి గాలులు వస్తున్నాయ్.. జాగ్రత్త!
NEWS Nov 19,2025 10:40 pm
తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే 2 రోజులపాటు రాష్ట్రంలో తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండనుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4–5 డిగ్రీల వరకు పడిపోవచ్చని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.