విద్యార్ధులకు భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు
NEWS Nov 19,2025 09:40 pm
గీతా జయంతి సందర్భంగా కోరుట్ల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గురువారం భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులకు 14వ అధ్యాయం ఆధారంగా, 10వ తరగతి నుండి ఇంటర్ వరకు ఉన్న విద్యార్థులకు 16వ అధ్యాయం ఆధారంగా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 7396950725, 944179075 నెంబర్లలో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.