ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్.. ఇందిరమ్మ చీరలు మంత్రుల భార్యలకు కూడా ఇస్తారా అని CM ను సరదాగా ప్రశ్నించారు. మంత్రుల భార్యలకు చీరలిస్తే మీరు కట్టుకునేలా ఉన్నారంటూ వారిని ఉద్ధేశించి సీఎం సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న మంత్రులంతా నవ్వారు. మంత్రి సీతక్క సీఎం, మంత్రుల కుటుంబాలకు కూడా చీరలు ఇస్తానంటే తనకు అభ్యంతరం లేదంటూ కూడా రేవంత్ మరో సూచన చేశారు.