సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో మోడీ
NEWS Nov 19,2025 05:44 pm
పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి బాబా శతజయంతి కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొని ప్రత్యేకంగా రూపొందించిన ₹100 స్మారక నాణెం, కొత్త తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు, క్రికెట్ లెజెండ్ సచిన్, తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి బాబా శతజయంతి జరుపుకోవటం సర్వాంతర్యామి ఇచ్చిన వరం అని పేర్కొన్నారు. ప్రేమ, కరుణ, సేవ అనే విలువలను ప్రపంచానికెత్తి చూపిన మహనీయుడు బాబా అని మోడీ అభివర్ణించారు.