పెద్దపల్లి మండలంలో అప్పన్నపేట సమీప రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అతడి తలకు తీవ్రంగా గాయమైనట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే ప్రైవేట్ అంబులెన్స్‌లో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహం ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.