అందుబాటులోకి మీ-సేవ WhatsApp
NEWS Nov 19,2025 10:44 am
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మరింత సౌకర్యంగా ప్రభుత్వ సేవలు అందించేందుకు మీ–సేవను WhatsAppలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదాయ, కుల, నివాస సర్టిఫికేట్‌లు, జనన–మరణ రిజిస్ట్రేషన్, భూమి సంబంధిత సేవలు నేరుగా WhatsApp ద్వారా పొందవచ్చు. ప్రభుత్వ నెంబర్ 80969 58096 కు “Hi” పంపితే మెనూ ఓపెన్ అవుతుంది. అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు పంపి, వచ్చిన పేమెంట్ లింక్ ద్వారా UPI, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సర్టిఫికేట్ సిద్ధమైన తర్వాత PDF రూపంలో WhatsAppలోనే అందుతుంది.