సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు
NEWS Nov 19,2025 09:14 am
AP: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 9.2 కేజీల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో పట్టణంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితర ప్రముఖులు జయంతి ఉత్సవాల్లో పాల్గొంటారు.