నేటి నుంచి ఇందిరమ్మ చీరలు పంపిణీ
NEWS Nov 18,2025 11:23 pm
TG: ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నేటి నుంచి మహిళలకు చీరల పంపిణీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా విగ్రహం వద్ద మధ్యాహ్నం 12 కు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. నేటి నుంచి డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో, మార్చి 1 నుంచి 8 వరకు పట్టణాల్లో మొత్తంగా కోటి మందికి 2 విడతల్లో చీరలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.