భారత్ హసీనాను బంగ్లాకు అప్పగించకపోవచ్చు!
NEWS Nov 18,2025 11:09 pm
నిరసనల అణచివేతకు ఆదేశాలిచ్చి పలువురి మృతికి కారణమయ్యారనే ఆరోపణలతో దేశాన్ని వీడిన PM హసీనాకు బంగ్లా కోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే. నేరారోపణలున్న ఆమెకు ఆశ్రయం తగదని ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం వెంటనే అప్పగించాలని ఆ దేశం ఇండియాను హెచ్చరించింది. అయితే అందుకు అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్ 8, 29 ప్రకారం రాజకీయ ప్రేరేపిత, న్యాయ విరుద్ధ అభ్యర్థనను తోసిపుచ్చే అధికారం ఇండియాకు ఉంది.