సిల్వర్ మెడల్ సాధించిన గురుకుల పాఠశాల విద్యార్థిని
NEWS Nov 18,2025 06:00 pm
మల్యాల మండలం తాటిపల్లి గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కమలిని అనే విద్యార్థిని రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించినట్లు ప్రిన్సిపల్ మానస, పీఈటీ మధులిక తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు కరీంనగర్ జిల్లా వెలిచాలలో జరిగిన అండర్-17 బాలికల విభాగంలోని యోగా ట్రెడిషనల్ లో కమలిని ఈ ఘనత సాధించిందన్నారు. ఈ సందర్భంగా కమలినిని ఉపాధ్యాయులు, తోటి విద్యార్థినులు అభినందించారు.