బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరవలేకపోవడంపై జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తొలిసారి స్పందించారు. ఓటమికి 100% తనదే బాధ్యత అని తెలిపారు. ‘మేం నిజాయితీగా ప్రయత్నించాం. కానీ విఫలమయ్యాం. మా ఆలోచనలను వివరించిన విధానంలో ఏదో పొరపాటు జరిగింది. దీన్ని ఒప్పుకోవడంలో నాకు మొహమాటం లేదు. మేం అధికారంలో మార్పు తీసుకురాలేకపోయినప్పటికీ రాష్ట్ర రాజకీయాలను మార్చడంలో కొంత పాత్ర పోషించాం’ అని చెప్పారు.