iBomma రవి ఇంట్లో అవమానాలు
NEWS Nov 18,2025 11:54 am
iBomma రవి లైఫ్ స్టోరీ సినిమాను మించిన కథ ఉంది. పోలీసుల విచారణలో వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు బయటకు వచ్చాయి. అవమానాలే అతణ్ని డబ్బు సంపాదన దారిలోకి నెట్టినట్లు తెలుస్తోంది. ‘డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు’ అంటూ ప్రేమించి పెళ్లాడిన భార్య, అత్త హేళన చేసేవారు. అవమానాలను తట్టుకోలేక తన వెబ్‌డిజైన్ నైపుణ్యంతో iBomma, BAPPAM సైట్లను రూపొందించాడు. భారీగా వచ్చిన డబ్బుతో జీవితం మారినా, భార్య తిరిగి రాలేదు. 2021లో యూరప్‌కు మకాం మార్చాడు.