బాబూరావు యజ్ఞోపవీతం సమర్పణ
NEWS Nov 18,2025 06:47 am
HYD: ‘నీలోఫర్ కేఫ్’ యజమాని బాబూరావు వజ్రాలు పొదిగిన బంగారు యజ్ఞోపవీతాన్ని సమ ర్పించారు. కేవలం ఒక నెల రోజుల్లోనే తయారు చేయించి TTDకి అందించారు. రూ.4.5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. దర్శనానికి వెళ్లినప్పు డు.. ‘యజ్ఞోపవీతం సమర్పిస్తావా?’ అని వెంకన్నస్వామి అడిగిన భావవ కలిగి నట్లు బాబూరావు తెలిపారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే.. ఎంతో భక్తితో ఈ ఆభరణాన్ని తయారు చేయించి ఇచ్చినట్లు చెప్పారు. సుమారు కిలో బంగారంతో పాటు, కోటి రూపాయల విలువైన వజ్రాలను ఈ ఆభరణానికి వినియోగించినట్లు తెలుస్తోంది.