తెలంగాణను వణికిస్తున్న తీవ్రమైన చలి
NEWS Nov 18,2025 08:50 am
తెలంగాణలో హైదరాబాద్‌తో పాటు అనేక జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, నిర్మల్ సహా పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీల మధ్య నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.