హనుమకొండ: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోని రక్ష సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రతిష్టాత్మక 'నంది ఎక్సలెన్స్ అవార్డ్స్' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. శ్రీ లక్ష్మినరసింహ స్వామి మ్యాట్రిమోని వ్యవస్థాప కులు సందగల్ల మధుసూధన్ గౌడ్ ను 'బెస్ట్ మ్యారే జ్ బ్యూరో మీడియేటర్'గా గుర్తిస్తూ నంది ఎక్సలె న్స్ అవార్డుతో సత్కరించారు. వివాహ సంబంధా లను ఏర్పరచడంలో ఆయన అందిస్తున్న విశేష సేవలను గుర్తిస్తూ రక్ష సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మన్ బోయిన స్వరూప ఆధ్వర్యంలో ఈ అవార్డును బహుకరించారు.