పార్టీపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు
NEWS Nov 17,2025 11:54 pm
TG: కాంగ్రెస్ పార్టీ పరంగా BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. తొలుత సర్పంచ్ ఎలక్షన్లు డిసెంబర్ లోనే నిర్వహిస్తామని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చితో ₹3వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండటంతో సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. కోర్టు తీర్పు అనంతరం MPTC, ZPTC ఎన్నికలకు వెళ్తామన్నారు.