భర్తను హత్య చేసిన భార్య, అత్త అరెస్టు
NEWS Nov 17,2025 07:42 pm
మెట్‌పల్లి చెందిన మండపల్లి భూమేష్‌కి మల్లాపూర్ మండలం కొత్తదామరాజుపల్లికు చెందిన విజయతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. దాంపత్య జీవితం ప్రారంభమైనప్పటి నుండి దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవన్న పోలీసులు తెలిపారు. ఈ కారణంగా విజయ తరచూ తన తల్లి ఇంట్లోనే ఉండేది. ఆదివారం భూమేష్ అత్తగారింటికి వెళ్లగా మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అత్త లక్ష్మి, భార్య విజయ ముందుగానే పథకం ప్రకారం భూమేష్‌ను హత్య చేసినట్లు సీఐ అనిల్ కుమార్ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.