AI కంటే పెద్ద సంక్షోభం: ఆనంద్ మహీంద్రా
NEWS Nov 17,2025 06:07 pm
AI వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు పోతాయనే భయం ఉన్నప్పటికీ, అసలు పెద్ద సంక్షోభం నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతేనని ఆనంద్ మహీంద్రా తెలిపారు. ఫోర్డ్ సీఈఓ జిమ్ ఫార్లే వ్యాఖ్యలను ఉదహరిస్తూ, ఫోర్డ్‌లో 5,000 మెకానిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వార్షిక వేతనం కోటి రూపాయలకు పైగానే ఉన్నా భర్తీ కావడం లేదన్నారు. అమెరికాలో ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ట్రక్కింగ్ రంగాల్లో 10 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయన్నారు. నైపుణ్య పనులు నిర్లక్ష్యమయ్యాయని, ఫ్యూచర్‌లో నైపుణ్యం కలిగిన వారే AI యుగంలో పెద్ద విజేతలవుతారని అన్నారు.