షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు
NEWS Nov 17,2025 09:51 am
ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన ICT కోర్టు.. షేక్ హసీనాను దోషిగా తేల్చింది. గత ఏడాది జులై, ఆగస్టులో విద్యార్థుల నిరసనల అణచివేత టైంలో 1400 మంది మృతిచెందారని ICT జడ్జి తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిని చంపేయాలని షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని షేక్ హసీనా ఆదేశించారని వ్యాఖ్యానించారు.