'ఐబొమ్మ' రవి వద్ద 50 లక్షల మంది డేటా
NEWS Nov 17,2025 02:54 pm
టాలీవుడ్‌కు వేల కోట్ల నష్టం కలిగిస్తున్న ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ కేసులో ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామని సీపీ సజ్జనార్ చెప్పారు. వేలాది సినిమాలను పైరసీ చేశాడు. పైరసీ ద్వారా సుమారు రూ.20 కోట్లు సంపాదించినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి రూ.3 కోట్లు స్వాధీనం చేసుకున్నాం" అని తెలిపారు. చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజు తదితరులు సీపీతో భేటీ అయి ఐబొమ్మ నిర్వాహకుడిని పట్టుకున్నందుకు సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు.