సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ
NEWS Nov 17,2025 02:46 pm
సినీ పరిశ్రమను షేక్ చేసిన ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు. ఆయనను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పోలీసులు పిటిషన్ వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు భేటీ అయ్యారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ప్రశంసించారు.