మృతుల్లో 45 మంది హైదరాబాద్ వాసులే
NEWS Nov 17,2025 07:53 am
సౌదీ అరేబియా ఘోర బస్సు ప్రమాదంలోని 45 మంది మృతులు హైదరాబాద్ వాసులేనని సమాచారం. పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్‌కు చెందిన వారేనని అధికారులు తెలిపారు. మక్కా యాత్రకు వెళ్లిన వీరు మక్కా నుంచి మదీనా వెళుతుండగా తమ బస్సుకు ఎదురుగా వచ్చిన డీజిల్ ట్యాంకర్ ను ఢీ కొట్టింది. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. బదర్– మదీనా ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన 45 మందిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు.