ఐబొమ్మ ఇమ్మడి రవి (వైజాగ్) జీవితం సినిమాను మించీ ఉంది. భార్యతో విభేదాల కారణంగా విదేశాల నుంచి విడాకుల కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. అతడి రాకను రవి భార్య ముందుగానే పోలీసులకు చెప్పినట్టు సమాచారం. కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తున్న రవి.. సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టాన్ని మిగిల్చాడు. ‘‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది.. నా వెబ్‌సైట్‌లపై ఫోకస్ చేయడం ఆపండి.. దమ్ముంటే నన్ను పట్టుకొండి’’ అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవి లైఫ్ స్టోరీ సినిమాను మించీ ఉందని తెలుస్తోంది.