ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లు క్లోజ్
NEWS Nov 16,2025 10:46 pm
ఇమ్మడి రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. గతంలో ‘‘నా వద్ద కోట్ల మంది డేటా ఉంది.. నా వెబ్‌సైట్‌లపై ఫోకస్ చేయడం ఆపండి’’ అంటూ సవాల్ విసిరిన రవికి చెందిన ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్‌సైట్‌లను అధికారులు క్లోజ్ చేశారు. రవి వద్ద నుంచి ఇప్పటికే ₹3 కోట్ల నగదు, వందల హార్డ్‌డిస్కులు, బ్యాంక్ ఖాతా వివరాలు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు, అతడిని కస్టడీలోకి తీసుకోవడానికి సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు.