మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్ మూవీ ‘వారణాసి’ని 2027 వేసవి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌లో మహేష్ మాట్లాడుతూ ‘‘వారణాసి రిలీజైనపుడు ప్రపంచమంతా గౌరవిస్తుంది. ఇది కేవలం టైటిల్ అనౌన్స్ మాత్రమే.. మున్ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. థ్యాంక్యూ అన్నది చాలా చిన్న మాట. నా ప్రేమ మాటల్లో చెప్పలేను. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకేమి తెలియదు.. ’’ అని మహేష్ అన్నారు.