రాజమౌళి - మహేశ్ బాబు కాంబినేషన్ సినిమా పేరు \'వారణాసి\'. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో ఈ టైటిల్‌ను పరిచయం చేశారు. ఈ చిత్రంలో మహేశ్ రుద్ర అనే పాత్రలో కనిపిస్తాడు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ గింప్స్, మహేశ్ లుక్ ఆకట్టుకుంటున్నాయి. నందిపై కూర్చుని, చేతిలో త్రిశూలంతో, మెడలో నంది లాకెట్ ధరించి ఆయన స్వారీ చేస్తున్నట్లుగా ఈ చిత్రం ఉంది.