కిషన్‌రావుపేట్‌లో ప్రమాదాన్ని తప్పించిన ఉదంతం
NEWS Nov 15,2025 10:06 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కిషన్‌రావుపేట్ గ్రామంలో వరి కోత కొనసాగుతుండగా పొలంలో ఉన్న విద్యుత్ స్తంభం ఆకస్మికంగా విరిగిపడింది. ఘటనను గమనించిన రైతులు వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వగా, అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇనుప స్తంభం కావడంతో తుప్పు పట్టి బలహీనపడటమే విరిగిపడడానికి కారణమై ఉండొచ్చని స్థానికులు పేర్కొన్నారు. రైతులు పాడైపోయిన స్తంభాన్ని వెంటనే మార్చాలని విద్యుత్ శాఖను కోరుతున్నారు.