సీఐడీ విచారణకు రానా, విష్ణుప్రియ
NEWS Nov 15,2025 06:09 pm
ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియ సీఐడీ సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయంలో అధికారులు వారి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. విష్ణుప్రియ 3 బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో మొత్తం 29 మంది సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి.