రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ \'పెద్ది\' నుంచి ఇటీవల విడుదలైన \'చికిరి చికిరి\' పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన రోజు నుంచే మ్యూజిక్ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పాట, తాజాగా 75 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, 1.44 మిలియన్లకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్‌లో ఈ పాట నం.1 స్థానంలో కొనసాగుతోంది.