2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి జూబ్లీహిల్స్ బై పోల్ వరకూ బీఆర్ఎస్ వరుస ఓటములతో సతమతమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే GHMC ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం చేకూరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ KCR సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అడ్‌హక్ కమిటీలతో పార్టీని నడిపిన ఆయన.. త్వరలోనే రాష్ట్రస్థాయి వరకూ కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.