పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ i-Bomma వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయన అకౌంట్లో ఉన్న రూ.3 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.