బీహార్: 25 ఏళ్లకే MLAగా యువతి
NEWS Nov 14,2025 07:02 pm
బీహార్ ఎన్నికల్లో యువ గాయని, పాతికేళ్ల బీజేపీ అభ్యర్థి మైథిలి ఠాకూర్ విజయం సాధించారు. అలీనగర్ నియోజకవర్గం ఆమె రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి, రాజకీయ ఉద్ధాండుడు వినోద్ మిశ్రాను ఓడించారు. సగానికిపైగా ముస్లిం ఓటర్లున్న ఆలీనగర్ నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పాతికేళ్ల యువతిని బీజేపీ బరిలోకి దింపింది. బీహార్ అసెంబ్లీకి అతిపిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించింది.