ఘనంగా లహుజీసాల్వే జయంతి వేడుక
NEWS Nov 14,2025 04:01 pm
HYD: 'క్రాంతిగురు' లహుజీ సాల్వే 231వ జయం తి వేడుకలు రవీంద్రభారతీలో ఘనంగా జరిగాయి. 'రాష్ట్రీయ స్వతంత్ర సంకల్ప దివస్' పేరిట మాంగ్ సమాజ్ తెలంగాణ అధ్యక్షులు గైక్వాడ్ తులసి దాస్ అధ్యక్షతన, తెలంగాణ భాషా సాంస్కృతిక, తెలంగాణ సాహిత్య అకాడమీ సహకారంతో ఈ వేడుకలు నిర్వహించారు. ప్రొ. కాశీం, భాషా, డా. ఎ.నరసింహ రెడ్డి, డా. ఎన్. బాలచారి, జె.ప్రేమ్, యాదగిరి, మహేశ్వర్ రాజ్, విట్టల్, జంగిటి వెంక -టేష్, ఆనంద్ రావు తదితరులు పాల్గొని సాల్వే సేవలను కొనియాడారు.