జూబ్లీహిల్స్: ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే..
NEWS Nov 14,2025 08:33 pm
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో బేర బాలకిషన్ కు అత్యధికంగా 175 ఓట్లు వచ్చాయి. NOTAకు 924 మంది ఓటు వేశారు.