గిరిజన బాలికల పాఠశాల-2లో బాలల దినోత్సవం
NEWS Nov 14,2025 11:48 pm
అనంతగిరి గిరిజన బాలికల పాఠశాల–2లో హెచ్.ఎం. బి. మంగమ్మ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్.ఎం. మంగమ్మ నెహ్రూ జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం దేశానికే గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. తరువాత విద్యార్థులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, వార్డెన్ రాజ్యలక్ష్మి, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.