క్వారీలో ఎలాంటి అక్రమాలు లేవు
NEWS Nov 14,2025 11:47 pm
జి.మాడుగుల మండలంలోని తవ్వకాలు చేస్తున్న క్వారీలో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగలేదని పాడేరు మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్ తెలిపారు. శుక్రవారం జి.నిట్టాపుట్టు క్వారీలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఆయన, క్వారీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతంలోనే, అనుమతుల ప్రకారం నిర్వహించబడుతోందని స్పష్టం చేశారు. అనుమతులు లేని ప్రదేశాల్లో ఎలాంటి తవ్వకాలు జరగలేదని ఆయన చెప్పారు. క్వారీకీ అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, ఎక్కడా తప్పిదాలు జరగలేదని మైనింగ్ AD ఆనంద్ స్పష్టంచేశారు.